రవీంద్రభారతిని సందర్శించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్‌ రవీంద్రభారతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా రవీంద్రభారతి ఆధునీకరణ పనులను సీఎం పరిశీలించారు. ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ సాహిత్య అకాడమీని రవీంద్రభారతిలో ఏర్పాటు చేయాలని చెప్పారు. అక్టోబర్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.