రద్దయిన పెద్దనోట్ల మార్పిడి ముఠా అరెస్ట్

ఏపీలోని భీమవరం నుంచి హైదరాబాద్ కు రద్దు చేసిన పెద్ద నోట్లను తీసుకొచ్చి మారుస్తున్న ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. భీమవరానికి చెందిన విజయ్.. కొన్నాళ్లుగా హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్నాడు. 20 శాతం కమీషన్ తో రద్దు చేసిన వెయ్యి, 500 రూపాయల నోట్లను మార్చి ఇస్తానంటూ.. భీమవరంలో తనకు తెలిసిన వాళ్లందరికీ చెప్పాడు. దాంతో అందరూ కలిసి 3 కోట్ల 48 లక్షల రూపాయలను పోగు చేసి.. ఎస్సార్ నగర్ లోని పింకీ అపార్టుమెంట్ కు పంపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తొమ్మిది మంది ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి దగ్గర్నుంచి రద్దు చేసిన పెద్ద నోట్లు, ఒక కారు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.