రజనీతో హిందూ మక్కల్ కట్చి నేతల భేటీ

సూపర్ స్టార్ రజనీ కాంత్ తో సమావేశమయ్యారు హిందూ మక్కల్ కట్చి నేతలు. ఆయన్ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.  రజనీ కాంత్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరి భేటీ మరింత ప్రాథాన్యత సంతరించుకుంది. తమిళనాడు ప్రజలకు, దేశానికి ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నట్లు హిందూ మక్కల్ కట్చి నేతలతో రజనీ చెప్పారు. అయితే ఇది కేవలం సాధారణ భేటీ మాత్రమేనని, రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.