యూపీ డిప్యూటీ సీఎంకు నితీశ్ సవాల్

ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్‌ మౌర్య సవాలుకు ప్రతి సవాల్ విసిరారు బీహార్  సీఎం నితీశ్ కుమార్‌. బీహార్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ క్లీన్ స్వీప్  చేస్తుందన్న మౌర్య వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రేపే ఎన్నికలకు వెళ్దామని, మీకు దమ్ముంటే ఉత్తర ప్రదేశ్ లో కూడా ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు నితీశ్‌. రైతులకు ఇచ్చిన హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చడం లేదని, వారు పండించే పంటలకు గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని నితీశ్ విమర్శించారు.