యూపీలో 22 మంది సజీవ దహనం

యూపీలోని రాయ్ బరేలీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును, ట్రక్కు ఢీకొట్టడంతో.. రెండు వాహనాల్లో మంటలు చెలరేగి.. 22 మంది సజీవదహనమయ్యారు. మరో 8మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నోకు తరలించారు. గతంలో మహబూబ్ నగర్ లోని పాలెంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనను తలపించేలా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా.. ఈ ప్రమాదం జరుగడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.