యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు!

బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్ తన తాజా చిత్రం ట్యూబ్‌లైట్ ప్రచార కార్యక్రమాల్లో భారత్-పాక్ యుద్ధంపై స్పందించారు. యుద్ధం ఒకటే సమస్యకు పరిష్కారం కాదని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని సల్మాన్‌ అభిప్రాయపడ్డారు. యుద్ధం వల్ల ఇరు పక్షాల సైన్యాలు తమ జీవితాలను కోల్పోతారని, దాంతో వారి కుటుంబాలు… కుమారులు లేదా వారి తండ్రులు లేకుండానే తమ జీవితాలను గడపాల్సి ఉంటుందని అన్నారు.