యాదగిరీషుడి సేవలో జానారెడ్డి

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎల్పీ నేత జానారెడ్డి కుటుంబ సమేతంగా ఈ ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రతిపక్ష నాయకుడికి మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.