యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు

ఎంసీఎల్‌ఆర్ రేటును 0.10 శాతం వరకు తగ్గించినట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. ఫలితంగా ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్ రేటు 8.25 శాతానికి తగ్గనున్నది. నెల కాలపరిమితి రుణ రేట్లపై వడ్డీని 10 బేసిస్ పాయింట్లు కోత పెట్టడంతో రేటు 7.80 శాతానికి తగ్గనుండగా, మూడు నెలల లోపు రుణాలపై 0.05 శాతం తగ్గి 8 శాతానికి చేరుకుంది.