మ‌య‌న్మార్‌ ఆర్మీ విమానం అదృశ్యం

మ‌య‌న్మార్ సైనిక విమానం ఆచూకీ గ‌ల్లంతయ్యింది. విమానంలో 116 మంది సైనికులు ఉన్న‌ట్లు ఆ దేశ ఆర్మీ చీఫ్ తెలిపారు. ద‌క్షిణ ప్రాంత న‌గ‌ర‌మైన మ‌యిక్, యాంగూన్ మ‌ధ్య విమానం గ‌ల్లంతైన‌ట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. మ‌ధ్యాహ్నం 1.35 నిమిషాల‌కు విమానంతో కమ్యూనికేష‌న్ తెగిపోయిందన్నారు. ద‌వాయి ప‌ట్ట‌ణానికి 20 మైళ్ల దూరం వెళ్లిన త‌ర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు చెప్పారు. అదృశ్య‌మైన విమానం కోసం గాలిస్తున్న‌ట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. విమానంలో మొత్తం 105 మంది సైనికులతో పాటు    11 మంది సిబ్బంది ఉన్నారు.