మూడు రోజులు ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఆ తర్వాత అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన రంగోళి పోటీల్లో ముగ్గులను పరిశీలించారు. కరీంనగర్‌ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మూడు రోజులు నిర్వహిస్తామన్నారు ఈటెల. ఈ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.

మంత్రి ఈటెలతో పాటు జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్ సింగ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.