ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం

సిద్దిపేటలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనల తర్వాత ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

దేశంలోనే రంజాన్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు మంత్రి హరీష్ రావు.  దేశంలోనే తొలిసారిగా ఇఫ్తార్ విందు ప్రారంభించింది మనమేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 4లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ కానుకలు ఇచ్చామన్నారు. మైనారిటీ పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందించడానికి 200లకు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు.