ముంబైలో వర్ష బీభత్సం

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమవుతోంది. గ‌త రెండు మూడు రోజుల‌నుంచి  కురుస్తున్న వానలతో ముంబై లోని రోడ్లన్ని జలమయమయ్యాయి. కింగ్స్  స‌ర్కిల్,  హింద్  మాతా  ఏరియా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వ‌ర్షాల‌తో అంబ‌ర్  నాథ్ – బ‌ద‌లాపూర్   ట్రైన్   రూట్    లో న‌డిచే లోకల్    ట్రైన్స్    ను క్యాన్సిల్    చేశారు  రైల్వే అధికారులు. ఇటు  సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. ఐదు మీటర్ల మెర అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. బీచ్‌    లో  స్థానికులు  అలలను ఎంజాయ్‌   చేస్తున్నారు.