ముంబైలో భారీ వర్షాలు

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల కాలనీలు నీట మునిగాయి. మరో 24 గంటల పాటూ వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.