మిక్స్‌డ్‌లో సానియా శుభారంభం

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వెటరన్ స్టార్ లియాండర్ పేస్.. డబుల్స్‌తో పాటు మిక్స్‌డ్‌లోనూ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇప్పటికే డబుల్స్‌లో వెనుదిరిగిన సానియా మీర్జా.. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డోడిగ్ జతగా మిక్స్‌డ్‌లో శుభారంభం చేసింది. తొలిరౌండ్లో సానియా-డోడిగ్ ద్వయం 7-5, 6-3తో డారిజా జురక్-మాటె పావిక్‌పై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న-పాబ్లో కావెస్ (ఉరుగ్వే) ద్వయం 5-7, 7-6, 6-4తో ట్రీట్ హువే-ఇస్తోమిన్ జోడీపై నెగ్గి మూడోరౌండ్లో ప్రవేశించింది. మరో భారతజంట పురవ్ రాజా-దివిజ్ శరణ్ 6-4, 3-6, 6-4తో ఒలివర్-మాట్ జోడీని ఓడించి ప్రీక్వార్టర్స్‌లో ప్రవేశించింది. మిక్స్‌డ్ తొలిరౌండ్ మ్యాచ్‌లో పేస్-మార్టినా హింగిస్ జోడీ 4-6, 6-1, 2-10తో స్రెబోత్నిక్-రావెన్ జంట చేతిలో ఓడింది. ఇక డబుల్స్ రెండోరౌండ్ మ్యాచ్‌లో పేస్-స్కాట్ లిప్‌స్కీ జంట 6-7, 2-6తో డేవిడ్-రొబ్రెడో జోడీ చేతిలో ఓడింది.