మాల్దీవుల్లో కాజోల్ ఫ్యామిలీ!

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్లు అజయ్‌దేవ్‌గన్, కాజోల్ ఫ్యామిలీ టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కాజోల్, అజయ్ అండ్ టీం ఫ్యామిలీ వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. కాజోల్ కూతురు నైసాతోపాటు అజయ్ సిస్టర్స్ నీలమ్, కవిత, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ మాల్దీవుల్లోని బీచ్‌లో షికారు చేస్తూ సందడి చేస్తున్నారు.  విరామం లేకుండా 5 నెలలు షూటింగ్‌లో పాల్గొన్న తాను, విశ్రాంతి కోసం మాల్దీవులకు వచ్చానని అజయ్ ట్వీట్ చేశాడు. తన కుటుంబసభ్యులతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం కాజోల్ వీఐపీ2 మూవీలో నటిస్తుండగా, అజయ్ దేవ్ గన్ గోల్ మాల్ అగెయిన్ సినిమాలో నటిస్తున్నాడు.