మాట మార్చిన కాజల్!

పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్‌కు మంచి మాటకారి. సందర్భోచితంగా మాట్లాడటం ఆమె నైజం. నటీనటులు ప్రాంతీయ భేదాలకు అతీతంగా వుండాలని ఒకప్పుడు చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు మాట మార్చింది. తాను పుట్టింది ఉత్తరాదిలో అయినా తనది దక్షిణాది అమ్మాయి మనస్తత్వమని చెప్పింది. బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సమయంలో తాను ముంబయి అమ్మాయినని ప్రకటించుకున్న ఈ సొగసరి.. ప్రస్తుతం అక్కడ అవకాశాలు లేకపోవడంతో మాట మార్చిందని అంటున్నారు.  ఇదిలావుండగా గతంలో ఓ మాస పత్రికకు హాట్‌హాట్‌గా ఫోజులిచ్చింది కాజల్‌. ఆమె ఫొటోషూట్‌పై విమర్శలు రావడంతో సదరు ఫొటోల్ని మార్ఫింగ్ చేసి విడుదల చేశారని ఆరోపణలు చేసింది. ఇలా అనేక సందర్భాలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో వార్తల్లో నిలిచింది. అయితే ఏదో యథాలాపంగా ఆమె అలా మాట్లాడుతుంది కానీ.. ఎవరికి హాని తలపెట్టని వ్యక్తిత్వం కాజల్ అగర్వాల్‌దని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఏదిఏమైనా తనదైన మాటల చాతుర్యంతో మాటల మాంత్రికురాలు అనే పేరు సంపాదించుకుంటున్నది.