మహారాష్ట్రలో రైతుల బంద్‌

రుణమాఫీ, కనీస మద్దతు ధర కోసం గతంలో రోడ్డెక్కిన మహారాష్ట్ర రైతులు.. తాజాగా బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో బంద్ వాతావరణం కనిపిస్తోంది. రైతుల బంద్ కు శివసేన తో పాటూ పలు విపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. దాంతో మెజార్టీ ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే రైతుల రుణమాఫీపై రాష్ట్రప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. అమల్లోకి వచ్చే వరకు ఆందోళనలు విరమించేది లేదని కొన్ని రైతు సంఘాలంటున్నాయి.