మహాప్రస్థానానికి చేరుకున్న సీఎం కేసీఆర్

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె అంత్యక్రియలు హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌ లోని మహాప్రస్థానం స్మశాన వాటికలో జరగనున్నాయి. కడసారి వీడ్కోలు పలికేందుకు అతిరథ మహారథులంతా మహాప్రస్థానానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతరప్రజాప్రతినిధులు మహాప్రస్థానానికి చేరుకున్నారు. అటు కవులు, కళాకారులు, అభిమానులు సినారె అంత్యక్రియలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.