మహంకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు

ఆషాఢ బోనాల జాతరలో భాగంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.  ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అన్ని రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది బోనాలను ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు. ఆషాఢ బోనాల జాతర రెండో శుక్రవారం శాకాంబరి ఉత్సవాలని నిర్వహిస్తామని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ పూజారి తెలిపారు.