మరో రెండేళ్లు ద్రావిడే!

ఇండియా ఏ, అండ‌ర్‌-19 టీమిండియా క్రికెట్ జ‌ట్ల‌కు కోచ్ గా రాహుల్ ద్రావిడ్‌ మ‌రో రెండేళ్లు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ విష‌యాన్ని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. ఇండియా ఏ జ‌ట్టు మ‌రికొన్ని రోజుల్లో సౌతాఫ్రికా వెళ్ల‌నున్న‌ది. అక్క‌డ నాలుగు రోజులు వ‌న్డే మ్యాచ్‌లు ఆడుతారు. ఫోర్ డే మ్యాచ్‌ల‌కు క‌రుణ్ నాయ‌ర్‌, వ‌న్డేల‌కు మ‌నీష్ పాండేల‌ను కెప్టెన్లుగా నియ‌మించారు. జూలైలో అండ‌ర్ 19 టీమ్ కూడా ఇంగ్లండ్ వెళ్ల‌నున్న‌ది. అయితే ద్రావిడ్ ఏ జట్టుతో టూర్‌కు వెళ్లేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.