మరో భారీ ప్రయోగానికి ఇస్రో సిద్ధం

వరుస విజయాలతో దూకుడుతో ఉన్న ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే బుధవారం ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి జీశాట్‌ -17 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. అత్యంత బరువైన ఉపగ్రహాలను పంపే వసతులు భారత్ లో లేకపోవడంతో..  ఫ్రెంచి గయాన నుంచి పంపుతున్నారు. జీశాట్‌-17 బరువు 3 వేల 425 కిలోలు. 15 ఏళ్లపాటు ఇది సేవలందించనుంది. ఇందులో 42 ట్రాన్స్‌ ఫాండర్లు ఉన్నాయి.