మరింత బలపడిన భారత్-అమెరికా మైత్రి

వైట్‌హౌజ్‌లోని కేబినెట్‌ రూంలో భారత్‌- అమెరికా ప్రతినిధుల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోడీ, ట్రంప్‌ పలు కీలక అంశాలపై చర్చించారు. మిలటరీ సామాగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నందుకు ట్రంప్‌  థ్యాంక్స్‌ చెప్పారు. ప్రధాని మోడీ స్పందిస్తూ అత్యంత పురాతన ప్రజాస్వామిక దేశం అమెరికా, అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్‌ల మైత్రి మరింత బలపడిందని మోడీ అన్నారు. అనంతరం వైట్‌హౌస్‌లోనే మోడీ, ట్రంప్‌ డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత అమెరికా పర్యటన ముగించుకొని మోడీ నెదర్లాండ్స్‌ బయల్దేరారు.

అంతకు ముందు మోడీ, ట్రంప్‌ల తొలి సమావేశం ఆత్మీయంగా జరిగింది. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేందుకు పునాది పడింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారు జామున ఒంటిగంటకు మోడీ వైట్‌ హౌస్‌కు చేరుకున్నారు. ట్రంప్‌, మెలినియా దంపతులు మోడీని ఆహ్వానించారు. షేక్ హ్యాండిచ్చి ఆత్మీయంగా పలుకరించారు.