మయూరి పార్క్‌ను గొప్పగా తీర్చిదిద్దుతాం

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటవుతున్న మయూరి పార్క్ ను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. పార్కు అంతటా తిరుగుతూ పనులను పరిశీలించారు. మయూరి పార్క్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద పార్క్‌ గా రూపొందిస్తామన్నారు.  త్వరలో ఓపెన్ జిమ్, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆట వస్తువులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ పార్క్ కు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా తయారు చేస్తామన్నారు.