‘మన సిద్దిపేట’ మొబైల్ యాప్ ఆవిష్కరణ

మన సిద్దిపేట మొబైల్ యాప్ ను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. సిద్దిపేటలో మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సుతో పాటు పలువురు నేతలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు హరితహారం కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం గంగిరెద్దుల సంక్షేమ సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిద్దిపేటలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ లెక్చరర్లు, ఉద్యోగులు, జర్నలిస్టులు మంత్రి హరీశ్ రావు ని కలిసి ధన్యవాదాలు తెలిపారు.