మంత్రి కేటీఆర్ పై ప్రశంసల వర్షం

గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న టెక్స్ టైల్స్ ఇండియా సీఈవోల మీటింగ్ లో మంత్రి కేటీఆర్ తనదైన శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఇన్వెస్టర్లకు అత్యుత్తమ సౌకర్యాలను కల్పిస్తామని ఘంటాపథంగా చెప్పారు. వియ్ మీట్ ఆర్ బీట్ అంటూ పెట్టుబడిదారులకు స్వాగతం పలికారు. కేటీఆర్ ప్రసంగంతో మీటింగ్ హాల్ మొత్తం కరతాళ ధ్వనులతో హోరెత్తింది. ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఐతే కేటీఆర్ ను భుజం తట్టి శభాష్ అని మెచ్చుకున్నారు. చంద్రబాబు సైతం నవ్వుతూ తన మెచ్చుకోలును చాటారు. యాంకరేమో వావ్‌.. వియ్ మీట్ ఆర్ వియ్ బీట్ దెమ్ గ్రేట్‌ అనేశారు.