భారత అటార్నీ జనరల్ గా వేణుగోపాల్

భారత అటార్నీ జనరల్ గా కేకే వేణుగోపాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. కేరళకు చెందిన కేకే వేణుగోపాల్.. గతంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా పని చేశారు. రాజ్యాంగంపై ఆయనకు అపారమైన పట్టు ఉంది. 1960లో అడ్వకేట్ గా జీవితాన్ని ప్రారంభించిన ఆయన… 50 ఏళ్ల వృత్తి జీవితంలో పలు కీలక కేసులు వాదించారు. 2015లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుత అటార్నీ జనరల్ మకుల్ రోహత్గీ పదవీ కాలం ముగియనుండటంతో .. ఆయన స్థానంలో కేకే వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.