భారత్ – పాక్ మ్యాచ్ పై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ

బ్రిటీష్ గడ్డపై దాయాదుల సమరం జరగనుంది..యావత్ క్రీడా ప్రపంచమే ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండో-పాక్ క్రికెట్ ఫైట్ కు లండన్ కెన్నింగ్ టన్ ఓవల్ స్టేడియం వేదిక కాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఫినాలేలో పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా సర్వసన్నద్ధం అవుతోంది. పాకిస్తాన్ పై మరో గ్రేట్ విక్టరీ కొట్టి వరుసగా రెండోసారి ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ పై టీమిండియాది ఎదురులేని రికార్డ్. మెగాటోర్నీల్లో ఎప్పుడు పాకిస్తాన్ పై టీమిండియా ఓడలేదు. అదే రికార్డ్ ఈ మ్యాచ్ లోనూ కంటిన్యూ చేసేందుకు విరాట్ సేన గట్టిగానే శ్రమిస్తోంది. ఈజీగానే ఫైనల్ కు చేరిన టీమిండియా టైటిల్ వార్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక సెమీస్ లో ఆతిథ్య ఇంగ్లండ్ పై సూపర్ విక్టరీతో ఫైనల్లోకి అడుగు పెట్టిన పాకిస్తాన్.. ఈ సారి చరిత్ర తిరగరాయాలని చూస్తోంది.

 ఏ విధంగా చూసినా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియానే బలంగా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లో అద్భుత ఫామ్ లో ఉంది. ఆల్ రెడీ లీగ్ దశలో పాకిస్తాన్ పై ఈజీ విక్టరీ కొట్టింది. అయితే పాకిస్తాన్ పై కంటే ఈ మ్యాచ్ లో టీమిండియాపైనే ఒత్తిడి ఎక్కువంటున్నారు స్పోర్ట్స్ ఎక్స్ ఫర్ట్స్.. దీంతో పాటు ఫైనల్లో పాకిస్తాన్ ను తక్కువగా అంచనా వేస్తే గట్టి ఎదురుదెబ్బ తగిలడం ఖాయం అంటున్నారు.

ఇక     పాకిస్తాన్ బౌలింగ్ కు టీమిండియా బ్యాటింగ్ కు జరిగే ఈ సమరాన్ని క్రికెట్ ఫ్యాన్స్ ఆస్వాదించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా ఆటగాళ్ల అనుభవమే..విరాట్ తో పాటు ధోనీ లాంటి మేటి ప్లేయర్లు ఒత్తిడి తట్టుకోవడంలో వారికి వారే సాటిగా నిలిచారు. టీమిండియాతో పోల్చుకుంటే యువ ప్లేయర్లతో నిండిన పాకిస్తాన్ శక్తిమేరకు రాణిస్తే తప్ప టీమిండియాపై విజయం సాధించడం అంత ఈజీ కాదని క్రికెట్ ఎనలిస్ట్ లు అంటున్నారు

మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ వరల్డ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ మ్యాచ్ లో రాణించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఓ వైపు పాక్ పై నెగ్గి టైటిల్ నిలబెట్టుకోవాలని  టీమిండియా ఉవ్విళ్లూరుతుంటే.. చరిత్ర తిరగరాసి మినీ వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవాలని పాకిస్తాన్ ఆరాటపడుతోంది.