భారతీయులు అప్రమత్తంగా ఉండండి!

ఖతార్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని దోహాలోని భారత రాయబార కార్యాలయం కోరింది. ఇందుకు సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. అవసరమైన వారికి రాయబార కార్యాలయం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని తెలిపింది.  ఖతార్‌తో రవాణా సంబంధాలను కూడా తెగదెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రేయిన్, ఈజిప్టు దేశాలు ప్రకటించాయి. దీంతో ఆయా దేశాల్లో పర్యటించాలనుకునే ఖతర్‌లోని భారతీయులు తమ ప్రయాణ ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలని కోరింది.