బ్రిటన్‌లో హంగ్

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడింది. అధికార కన్జర్వేటీవ్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది. మొత్తం 650 స్థానాలకు గాను ఇప్పటి వరకూ 646 స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. ప్రస్తుత ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ 315 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ 261 స్థానాల్లో విజయం సాధించింది.  గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే 29 స్థానాలను అదనంగా తన ఖాతాలో వేసుకుంది. స్కాటీష్‌ నేషనల్‌ పార్టీ 35, లిబరల్‌ డెమోక్రాట్స్‌ 12 స్థానాల్లో గెలుపొందగా.. ఇతరులు 23 స్థానాల్లో విజయం సాధించారు.