బ్యాంక్ ఖాతాలకు ఆధార్ తప్పనిసరి

బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు ఆధార్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.  కొత్తగా బ్యాంకు ఖాతాలు తీసుకునే వారు ఆధార్ ను తప్పనిసరిగా సమర్పించాలని తెలిపింది. ప్రస్తుతం ఆధార్ ను అనుసంధానం చేయని ఖాతాదారులు, డిసెంబర్ 31 లోగా లింక్ చేయాలని తెలిపింది. లేకపోతే ఖాతాలు నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇక లావాదేవీల విషయంలో కూడా ఆధార్ ను తప్పనిసరి చేసింది కేంద్రం. 50వేల రూపాయలకు పైగా లావాదేవీలు జరపాల్సి వస్తే… ఆధార్ ను కంపల్సరీగా సమర్పించాలని తెలిపింది.