బెవరేజస్ కార్పోరేషన్ చైర్మన్ గా దేవీప్రసాద్ భాద్యతలు స్వీకరణ

హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారి భవన్ లో తెలంగాణ రాష్ట్ర బెవరేజస్ కార్పోరేషన్ చైర్మన్ గా  దేవీప్రసాదరావు భాద్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రి పద్మారావు , ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, టిఎన్జీఓస్ నాయకులు హాజరయ్యారు. బాధ్యతలు చేపట్టిన దేవీప్రసాద్ కు అభినందనలు తెలిపారు.