బెంగాలీపై గూర్ఖాల ఆగ్రహం

ప్రభుత్వ పాఠశాలల్లో బెంగాలీని తప్పనిసరి చేస్తూ బెంగాల్ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. డార్జిలింగ్ లో మమతా బెనర్జీ బస చేసిన ప్రభుత్వ గెస్ట్ హౌజ్ వద్ద గూర్ఖా జన ముక్తి మోర్చా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. ఆందోళనలపై చర్చించేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.