బీహార్ గవర్నర్ గా కేసరి నాథ్ త్రిపాఠికి అదనపు బాధ్యతలు

బీహార్ గవర్నర్ గా కేసరి నాథ్ త్రిపాఠికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం బెంగాల్ గవర్నర్ గా ఉన్న కేసరినాథ్ త్రిపాఠి…. రామ్ నాథ్ కోవింద్ రాజీనామాతో ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మరోవైపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన రామ్ నాథ్ కోవింద్…. తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదించారు. ఈ నెల 23న రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్నారు. అందుకోసం అన్ని పదవులకు ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది.