బీడీ కార్మికులకు భృతి పత్రాల పంపిణీ

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నిజామాబాద్ లో 5,762 మంది బీడీ కార్మికులకు జీవన భృతి పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, బిగాల గణేష్ గుప్తా, షకీల్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, మేయర్ సుజాత, కలెక్టర్ యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.