బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అభ్యర్ధి ఎంపికపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ….పార్లమెంటరీ పార్టీకి నివేదిక సమర్పించింది. ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం…పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. బీజేపీ చీఫ్ అమిత్ షా…నిన్న ఉద్దవ్ థాక్రేను కలిసిన సమయంలో…ఆయన ప్రతిపాదించిన పేర్లను కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఇక రాష్ట్రపతి అభ్యర్ధిపై మిత్రపక్షాల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రపతి రేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్, ద్రౌపది ముర్ముల పేర్లు వినిపిస్తున్నారు. అయితే రాష్ట్రపతి ఎంపికను ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల నిర్ణయానికే వదిలేశారు పార్లమెంటరీ పార్టీ నేతలు.  మరోవైపు ఈ నెల 23న ఎన్డీయే అభ్యర్ధి నామినేషన్ వేయనున్నందున… నామినేషన్ పేపర్లపై మద్దతు సంతకాలు చేసేందుకు  పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తోపాటూ, కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్య,  సుష్మా, గడ్కరి, అనంత్ కుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.