బాలానగర్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

హైదరాబాద్‌ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ కేసులో అరెస్ట్‌ అయిన సబ్‌ రిజిస్ట్రార్‌ యూసుఫ్‌ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టారు. ఆఫీసులోని పలు డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు.