బాధ్యతలు స్వీకరించిన వాసుదేవరెడ్డి

రాష్ట్ర వికలాంగుల కో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌  ఛైర్మన్‌  గా వాసుదేవ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మలక్‌  పేటలోని వికలాంగుల కార్పొరేషన్‌  కార్యాలయంలో ఆ శాఖ డైరక్టర్‌  శైలజ.. వాసుదేవారెడ్డితో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, తుమ్మల, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌  రెడ్డి, సివిల్‌  సప్లైస్‌  కార్పొరేషన్‌  చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌  రెడ్డి, కుడా ఛైర్మన్‌  మర్రి యాదవరెడ్డి రెడ్డి, టీఆర్ఎస్‌  మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి పాల్గొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని వాసుదేవరెడ్డి అన్నారు.