బాధ్యతలు చేపట్టిన గాంధీ నాయక్

తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ తొలి చైర్మన్ గా దారావత్ మోహన్ గాంధీ నాయక్ బాధ్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, చందూలాల్‌, ప్రభుత్వ విప్ లు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్ రాములు, గిరిజన సంఘాల నాయకులు హాజరయ్యారు. తనకు ఈ పదవినిచ్చిన సీఎం కేసీఆర్‌ కు రుణపడి ఉంటానన్నారు గాంధీ నాయక్‌.