బషీరాబాద్ లో గొర్రెల పంపిణీ చేసిన మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా  బషీరాబాద్ మండలం కొర్విచెడ్ లో… గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. లబ్దిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన గొల్లకుర్మలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో 84 లక్షల మందికి 4 వేల కోట్లతో గొర్రెలు పంపిణీ చేశామన్నారు.