బంగ్లాదేశ్‌లో 100కు చేరిన మృతులు

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడ్రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వానలతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి.. 100మందికిపై గా చనిపోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.