ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వారింకా x నాదల్

క్లే కోర్ట్ గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్‌ చివరి దశకు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌ లో స్పెయిన్ బుల్ నాదల్, స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకా ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో నాదల్‌ సునాయస విజయం సాధించాడు. డిమినిక్ థీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-3, 6-4, 6-0 తేడాతో వరుస సెట్లలో గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో సెమీఫైనల్లో బ్రిటన్ ప్లేయర్ ఆండీ ముర్రేకు వావ్రింకా షాకిచ్చాడు. ఐదు సెట్ల హోరాహోరీ పోరులో 6-7, 6-3, 5-7, 7-6, 6-1 తేడాతో విజయం సాధించాడు. రేపు జరగనున్న టైటిల్ పోరులో నాదల్, వావ్రింకా తలపడనున్నారు.