ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌ లో లాత్వియా క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకో చరిత్ర సృష్టించింది. 34 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా ఒస్టాపెంకో నిలిచింది. సెమీఫైనల్లో బాసిన్ స్కీతో జరిగిన మ్యాచ్‌లో 7-6, 3-6, 6-3 తేడాతో అద్భుత విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో రొమేనియా ప్లేయర్ రెండో సీడ్‌ హాలెప్ 6-4, 3-6, 6-3 తేడాతో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ప్లిస్కోవాను ఓడించింది. రేపు జరగనున్న ఫైనల్‌ పోరులో ఒస్టాపెంకో, హాలెప్ తలపడనున్నారు.