ఫీజు కట్టలేదని పిల్లల బట్టలు విప్పించారు

స్కూల్ ఫీజు కట్టలేదని ఇద్దరు చిన్నారులను ఘోరంగా అవమానించింది బీహార్ కు చెందిన ఓ స్కూల్ యాజమాన్యం. ఫీజు చెల్లించనందుకు…. ఇద్దరు బాలికల బట్టలు విప్పించి నిలబెట్టారు స్కూల్ ప్రిన్సిపల్, టీచర్. బీహార్ లోని బెగుసరాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అనారోగ్యం కారణంగా పిల్లల తండ్రి ఫీజు కట్టలేకపోయాడు. ఈ విషయం స్కూల్ ప్రిన్సిపాల్ కు ముందస్తు సమాచారం కూడా ఇచ్చారు. అయినప్పటికీ  కనికరం చూపని బిఆర్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రిన్సిపాల్ దారుణానికి ఒడిగట్టింది. విద్యార్ధినిల పేరెంట్స్ ఫిర్యాదుతో ప్రిన్సిపాల్ తో పాటు ఒక టీచర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.