ప్రేమించలేదని పొడిచి చంపాడు

నరేష్-స్వాతి ప్రేమ పెళ్లి, విషాదాంతం మర్చిపోకముందే యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో దారుణం జరిగింది. యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లిలో గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే యువకుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి ఇంట్లోకి ప్రవేశించిన శ్రీకాంత్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన గాయత్రిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది.

తనను ప్రేమించాలని శ్రీకాంత్ కొన్నాళ్లుగా గాయత్రి వెంటబడుతున్నట్టు చెబుతున్నారు. ఆమెకు పెళ్లి నిశ్చయించిన తల్లిదండ్రులు రేపు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీంతో, గాయత్రిని శ్రీకాంత్ పొడిచినట్టు చెబుతున్నారు. నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.