ప్రభుత్వ లాంఛనాలతో సినారె అంత్యక్రియలు పూర్తి

సాహితీదిగ్గజం డాక్టర్ సి.నారాయణరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిలింనగర్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సినారె అంతిమ సంస్కారాలకు సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాహితీ ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి భారీ సంఖ్య లో కవులు, కళాకారులు, అభిమానులు అంత్యక్రియలకు తరలివచ్చి నివాళులర్పించారు. అభిమాన కవికి శ్రద్ధాంజలి ఘటించారు.