ప్రపంచ హాకీ లీగ్ ఫైనల్ కు భారత్

లండన్‌ లో జరుగుతున్న ప్రపంచ హాకీ లీగ్‌ సెమీఫైనల్‌ టోర్నీలో భారత జట్టు సత్తా చాటింది. దాయాది పాకిస్థాన్‌పై 7-1 తేడాతో ఘన విజయం సాధించింది. తొలి నుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన భారత జట్టు ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశమివ్వలేదు. ఆటగాళ్లు ఆకాశ్‌ దీప్‌, హర్మన్‌ప్రీత్‌, తల్వీందర్‌సింగ్‌ రెండేసి గోల్స్‌, ప్రదీప్ కుమార్ ఒక గోల్‌ చేశారు. పాక్‌ తరఫున మహ్మద్‌ ఉమర్‌ బుట్టా మాత్రమే ఒక్క గోల్‌ చేశాడు. పాక్‌పై గెలుపుతో భారత జట్టు హ్యాట్రిక్‌ విజయం సాధించింది.