ప్రధాని విజ్ఞప్తి మేరకు దళిత నేతకు మద్దతు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ ఫోన్ చేశారని చెప్పారు. అట్టడుగు వర్గానికి చెందిన విద్యావంతున్ని ఎంపిక చేసినందున ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశానికి ఉపయోగపడే ప్రతి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్నోసార్లు సమర్థించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు.