ప్రధానిగా పీవీ సేవలు తెలంగాణకు గర్వకారణం

బహుభాషా కోవిదుడిగా, పరిపాలనా దక్షుడిగా మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రేపు (ఈ నెల 28న) పీవీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి ఎదిగి దేశ ప్రధానిగా సేవలందించడం రాష్ట్ర ప్రజలకు ఎన్నటికీ గర్వకారణమేనన్నారు.