ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

విస్తృతంగా మొక్కలు నాటి గ్రామాల్లో పచ్చదనాన్ని నింపినప్పుడే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక, జగదేవ్‌పూర్ మండలాల్లో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి ఆమె పర్యటించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పరిశీలించారు. గ్రామాల్లోని హరితహారం కమిటీలు హరితహారం కార్యక్రమాన్ని సవాలుగా స్వీకరించి విజయవంతం చేయాలని కోరారు.