ప్రణయ్‌రాయ్ ఇంట్లో సీబీఐ సోదాలు

ఎన్డీటీవీ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ కో- ఛైర్మన్ ప్రణయ్ రాయ్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీతో పాటూ డెహ్రాడూన్ లోని ఆయన నివాసాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. ఐసీఐసీఐ బ్యాంకుకు 48 కోట్ల రూపాయల నష్టం కలిగించారనే ఆరోపణలపై ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. మొత్తం నాలుగు ప్రదేశాల్లో సీబీఐ టీమ్‌లు సెర్చ్ చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు ఫిర్యాదుతో ప్రణయ్ రాయ్ , రాధికారాయ్ తో పాటూ మరో ప్రైవేట్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది.